ప్రాంతీయం

వృద్ధాశ్రమంలోఘనంగా జన్మదిన వేడుకలు మహాన్నదానం…

284 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 26 హెచ్ పి పెట్రోల్ బంక్ లో జాబ్ నిర్వహిస్తున్న మొఱ్ఱైపల్లి చెందిన బద్దిపడిగె అనూష-అంజిరెడ్డి దంపతుల తనయుడి పజన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా  గభీరావుపేటలొని వృద్ధాశ్రమంలోనికి వెళ్లి తనవంతు సహాయంగా వృద్ధులకు అన్నదానంచేశారు. ఈసందర్భంగా బద్దిపడిగే అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో మరియు అనాధాశ్రమం జరుపు కోవడం చాలా ఆనందదాయకంగా ఉంటుందన్నారు. అన్నిదానాల్లో కన్నా అన్నదానం సంతోషాన్నిస్తుందని ఏదానంచేసిన ఇంకా కావాలనిపిస్తుందని అంటారే తప్ప అన్నదానం చేస్తే కడుపునిండా తిన్నతర్వాత ఇక చాలు అంటారు. అనాధాశ్రమంలో అన్నదానం అనంతరం వృద్ధులు మనల్ని మనసారా ఆశీర్వదిస్తారు. అలాంటి ఆశీర్వాదం మన పిల్లలకు మేలు చేస్తుందని పుట్టినరోజులు శుభకార్యాలు అనాధ ఆశ్రమాలలో పదిమందికి అన్నదానం చేపట్టడం మంచి జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *