ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 13, మండలోని పోతుగల్ గ్రామంలో రాణి రుద్రమ మాట్లాడుతూ ప్రతి గడపగడపకు వెళ్లి కమలం పువ్వు గుర్తులను గుర్తుచేయాలని సమీక్ష సమావేశం చేశారు. ప్రతి బూతు లోపల ఐదు కమలం పూవుల గుర్తులు వేసి ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి వారికి భారతీయ జనతా పార్టీ గుర్తు చేయడం ప్రతి చివరి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాల గురించి తెలపడం ఎన్నెన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయాల అంశాలపై మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తూ ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం గూర్చి తెలపడానికి రాజన్న సిరిసిల్లా నుండి వదులుకొని ప్రతి గ్రామంనకు తెలపడం గూర్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే పోతుగల్ గ్రామంలో కమలం గుర్తు నమూనా వేస్తూ తెలిపారు. ఈ విధంగా ప్రజల దగ్గరికే బిజెపి పార్టీ భరోసా గురించి తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఊరటి రాజు, రెడ్డబోయిన గోపి, కరెడ్ల మల్లారెడ్డి, చెర్లపెళ్లి సుధాకర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, వరి వెంకటేష్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
