సెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్:
చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల్ కాజిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గోదారి సురేష్, కిడ్నీ సమస్యతో బాధపడుతూ మెడిసిన్ కొనుక్కో వడానికి ఆర్థికంగా చాల ఇబ్బంది పడుతున్నారని స్థానికుల చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ తెలియచేయగా వారు వెంటనే స్పందించి మూడువేల రూపాయల టాబ్లెట్స్ అదే విధంగా 25kg రైస్ కొని పంపించగా దుర్గం అశోక్ యువసేన సభ్యులు కొమ్ము సురేందర్,గోదారి మల్లయ్య, గోదారి రాజమ్మ, గోదారి దుర్గమ్మ , శ్రీలత, సురేందర్, లింగయ్య, గోదారి శివరాజ్, అంకులు , చిన్నలింగయ్య, దుర్గం రాములు, దుర్గం సిద్దార్థ వారి ఇంటికి వెల్లి అందివ్వడం జరిగింది.
అది చూసిన అక్కడి ప్రజలు ఏపదవి లేకుండానే వేలమంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు ఇలాంటి మంచి మనసున్న సేవకుడే నాయకుడు ఐతే ఇంకా వేలమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరుగతుంది కనుక ప్రజలతో సంబంధం లేని ఏవ్యక్తిని కూడ వేరే నియోజకవర్గంలో గెలిపించనే గెలిపించరు కనుక మనం కూడ ఇక్కడ? ఎవరో ముక్కు మొహం తెలియని వారిని కాకుండా అందరికి అందుబాటులో ఉంటూ సౌమ్యంగా మాట్లాడుతూ, కోపతాపాలు బెదిరింపులు లేకుండా మనకుటుంబంలో ఒకడిగా కలసి ఉంటున్న దుర్గం అశోక్ ను ఎమ్మెల్యేగా గెలిపించు కోవాలని చర్చించు కుంటున్నారు.
అనంతరం సురేష్, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ స్థానికులు మాకుటుంబ పరిస్థితి గురించి చెప్పిన వెంటనే స్పందించి తనవంతు సహాయం అందించిన దుర్గం అశోక్ కు కృతజ్ఞతలు అని తెలిపారు.
