ప్రాంతీయం

భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువత ఉద్యమించాలి

243 Views

సెప్టెంబర్ 29

ఇల్లంతకుంట మండల యువత అధ్వర్యంలో బస్టాండ్ అవరణలో భగత్ సింగ్ 116వ జయంతిని పునస్కరించుకొని షాహిద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించి నివాళలర్పించారు.
మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం ‌అనే నినాదంతో భారతదేశ ప్రజల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చిన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని అన్నారు. చిన్న వయసులోనే బ్రిటిష్ ‌ వారి పార్లమెంటు మీద పొగ బాంబు వేసి బ్రిటిష్ వారిని గడగడలాడించిన్న గొప్ప వ్యక్తి భగత్ సింగ్ మా దేశం నుండి మీరు వెళ్లిపోవాలని బ్రిటిష్ వారిని హెచ్చరించిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. 16 సం “ల వయస్సులోనే ఉరితాడుని ముద్దాడిన భగత్ సింగ్ నేటితరం యువత విద్యార్థులు వారి యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల కోసం ముందుకు నడవాలని వారు పిలుపునిచ్చారు. విప్లవ వీర కిషోర్ భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు ప్రఖ్యాత ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యం పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అని నినాదం ఇచ్చింది కూడా భగత్ సింగ్. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి. బ్రిటిష్ సామ్రరాజ్యం పై గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం నాయకులు మంద అనిల్ కుమార్, పైస మోజెస్, ఎర్రోజు సంతోష్,గొడుగు నరేందర్,ఒగ్గు మధు,ఎలుక అనిల్,రాయినిపట్ల రాజు,దాసరి శివరాం,ఎండ్ర నరేష్,నరేష్,నముడ్ల సుమన్,పెండల ఆదిత్య, చిగుర్ల అనిల్, పందుల రామ్ చరణ్,అరుణ్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *