ప్రాంతీయం

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 

81 Views

 

ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మంచిర్యాల సెప్టెంబర్ 26

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని

ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నీ విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గురించి ప్రధానోపాధ్యాయురాలు పిల్లలకు వివరించారు ఇందులో భాగంగా తెలంగాణ ఎంతోమంది వీరులకు వీర వనితలకు పుట్టినిల్లు. అని తెలియజేశారు అట్లాంటి వీర వనితల్లో ఒకరు చాకలి ఐలమ్మ నాటి కాలంలో పాలకులను ఎదిరించి తెలంగాణ మహిళల వీరత్వం చాటి చెప్పిన పోరాట యోధురాలు ఐలమ్మ అని వివరించారు. చాకలి ఐలమ్మ ఓరుగల్లు జిల్లా రాయపర్తి లోని కిస్టాపురంలోన ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దుల కూతురై పుట్టింది రజక కులంలోన రత్నదీపమై ఊరువాడన పేరొందింది. తాను 13వ ఏటనే చిట్యాల నరసింహులు ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది. కులకాయికముతోని కూటికి జాలక వ్యవసాయంను కూడా చేసింది, ఏటా పంటలు పండించి సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నది. అలాంటి వీరవనితలు తెలంగాణలో ఎంతోమంది ఉన్నారని వారందరినీ గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడలలో నడవాలని వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి, ఉపాధ్యాయురాలు కె జ్యోతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్