దౌల్తాబాద్: పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యమని సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాయిపల్లి, శేరిపల్లి బందారం గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహార ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవాలని సూచించారు. పోషకాహారం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం పోషకాహార విలువలపై గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సునీత, మనోజ్, అంగన్వాడీ టీచర్లు ప్రశాంత, కవిత, మంజుల తోపాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు…
