– మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్
దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పర్ పల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ సోదరుడు లక్ష్మణ్ గౌడ్, హైమద్ నగర్ లో జానీ మియా లు మృతి చెందగా కుటుంబాలను పరామర్శించారు. అలాగే మల్లేశం పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి మృతి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న భూదయ్య, సత్తమ్మ, దౌల్తాబాద్ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పబ్బ అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకు తెలిపితే తప్పకుండా స్పందించి తన వంతు సహాయం అందిస్తానన్నారు. నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, సర్పంచ్ దార సత్యం, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగరాజు గౌడ్, నాయకులు మంజూర్, పాషా, స్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు….