ప్రాంతీయం

ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటాం

182 Views

దౌల్తాబాద్: బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్ర దౌల్తాబాద్ లో వివిధ పాఠశాలలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. అనంతరం పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం సభ్యత్వ రుసుముతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని అన్నారు. ఎమ్మార్సీ సిబ్బంది ఎస్ఎస్ ఏ ఉద్యోగుల మినిమం టైం స్కేల్ ఇతర సమస్యల గురించి రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి త్యాగరాజు, పి ఆర్ టి యు నాయకులు జగన్, ప్రభాకర్, రాజయ్య, వేణుగోపాల స్వామి, సర్దార్ హుస్సేన్,సీఆర్పీలు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *