ప్రాంతీయం

మహిళల రైతులకు కూరగాయ విత్తనాలు పంపిణీ

96 Views

దౌల్తాబాద్: మహిళలు వ్యవసాయ రంగం లో అధునాతన పద్దతుల పై అవగానన పెంచుకొని తద్వారా ఖర్చులు తగ్గించు కొని అధిక లాభాలు పొందాలని, సెహగల్ ఫౌండేషన్ ప్రోగ్రాం లీడర్ శ్రీ వి.సంతోష్ కుమార్ అధ్వర్యంలో మండలం లోని తిరుమల పూర్ గ్రామంలో సేహగల్ ఫౌండేషన్ వారి అధ్ర్వరం లో 18 మంది మహిళా రైతులకు కూరగాయ పంటల పై అవగాహన కల్పించి, మహిళా రైతులకు టమాటో, మిరప, వంకాయ, కొత్తిమీర, సొర, బీర, పొట్ల కాయ, బెండ,బంతి విత్తనాలను మరియు మైక్రో nutrients ఉచితం గా పంపిణి చేసారు.
ఈ సందర్భంగా సేహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు లారెన్స్ గారు మాట్లాడుతూ సేహగల్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను మహిళా రైతులు అందిపుచ్చుకొని ఆర్ధికం గా లాభం పొందాలని కోరారు. ఇచ్చిన కూరగాయ విత్తనాలను ప్రతి మహిళా రైతు తమ యొక్క పొలంలో విత్తుకొని, వచ్చిన పంట నుండి మళ్లీ విత్తనం తయారు చేసుకోవాలని తెలిపారు. అంతే కాకుండా కాలం తో పాటు వ్యవసాయ రంగం లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగు విధానం లో మార్పు చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక పంటల కంటే స్వల్ప కాలిక పంటలు సాగు చేయటం వలన ఎక్కువ లాభాలు పొందవచ్చునని అన్నారు. ఈ కార్య కార్యక్రమములో గ్రామ సర్పంచ్ గడ్డమీద భాగ్య లక్ష్మి గారు, గ్రామ పెద్దలు,తదితరులు మరియు సేహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వై. లారెన్స్ మరియు మహిళా రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh