రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గాజులపల్లి రాజేల్లవ్వ తన మరిది గాజులపల్లి ముత్యం భార్య 13 నెలల క్రితం రొమ్ముక్యాన్సర్ వచ్చి చనిపోగా దానికి కారణం రాజేల్లవ్వ మంత్రాలు చేసి చంపిందని అనుమానం పెట్టుకొని ఆమె పై పగ పెంచుకుని నెల రోజుల క్రితం వాళ్ళ అత్తయ్య బుధవ్వ చనిపోయిందని ఆమె చనిపోకముందు ముత్యం వద్దే బుధవ్వ ఉందని అయితే బుధవ్వకు సంబంధించిన చేతి కడియాలు 20 తులాల వెండివి కనబడుట లేదు అని అడిగినందుకు పాత పగలు మనసులో పెట్టుకొని మంగళవారం ఉదయం 8:00 ప్రాంతంలో రాజేల్లవ్వ ఇంటిలోకి అక్రమంగా చొరబడి ఇష్టం వచ్చిన రీతిలో బూతులు తిడుతూ తల మీద నొసటి భాగంలో కొట్టడని ఎప్పటికైనా నిన్ను చంపుతానని బెదిరించాడని అన్నాడని తల నొసటి భాగంలో రక్త గాయాలు అయ్యాయి అని రాజేల్లవ్వ ఎస్సై కి దరఖాస్తు ఇవ్వగా
ఎస్ ఐ మహేష్ ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
