ముస్తాబాద్ నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) నిబంధన ఉల్లంఘించి జనసంచార ప్రదేశాలలో టపాసులు విక్రయం.. ముస్తాబాద్ మండల కేంద్రంలో తపాకాయల దుకాణాలు పుట్టగొడుగుల్లా గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకుండా జనసంచారంలో ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఉండి నిబంధనలు విరుద్ధంగా ఎటువంటి ప్రమాద జాగ్రత్తలు పాటించకుండా వాయు కాలుష్యానికి ప్రమాదకరమైన బేరియం నైట్రేట్‌తో చేసిన టపాసులు పండగ రోజు కాల్చడంతో సాధారణ రోజులుకన్నా నాలుగు రెట్లు అధికంగా కాలుష్యం రెట్టింపు అవడం తెలిసిన అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. శివకేశవ ఆలయం అభివృద్ధి కొరకు తపాకాయల టెండర్లు రెండు రోజులు అనుమతులు ఇచ్చినప్పటికిని సంవత్సరం పొడుగునా టపాకాయలు అధిక ధరలతో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
