గుంటపెల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్
ఎల్లారెడ్డిపేట మార్చి 23 ;
ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిర్ల రాజు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు,
వెంకటాపూర్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ చంద్రకాంత్ ను గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు,
గుంటపల్లి చెరువు తండా పంచాయతీ కార్యదర్శి గా ఆదనపు బాధ్యతలను చంద్రకాంత్ శనివారం స్వీకరించారు,
