బిజెపి కో న్యాయం, బి ఆర్ ఎస్ కో, న్యాయమా❓️:మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
మహబూబ్ నగర్:సెప్టెంబర్ 25
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ ను తెలంగాణ గవర్నర్ తిరస్కరించారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్… ఎలాంటి సామాజిక సేవ చేయలేదంటూ, వీరు రాజకీయ నాయకులని పేర్కొంటూ గవర్నర్ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
