కేసిఆర్ హ్యాట్రిక్ సిఏం కావడం ఖాయం
మీ ఇంటి ఆడ బిడ్డగా ఆదరించండి
జెడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి
ములుగు,సెప్టెంబర్ 25
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాదించి నియోజకవర్గ గడ్డ పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయ మని ములుగు నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ధీమా వ్యక్తం చేశారు.ములుగు జిల్లా కేంద్రం లోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ములుగు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ములుగు మండల ఎన్నికల ఇంచార్జీ వై సతీష్ రెడ్డితో కలిసి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసిఆర్ మూడో సారి రాష్ట్రాన్ని పాలిం చడం తద్యమని ఆమె తెల్చి చెప్పారు.సిఏం కేసిఆర్ సార థ్యంలో తెలంగాణ అభివృద్ది చెంది దేశంలోనే నం 1 గా నిలిచిందని అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ ది అని ఆమె కొనియాడారు. రైతుల అభ్యున్నతికి 24 గం టల ఉచిత కరెంట్ రైతు బందు రైతు భీమా లాంటి ఎన్నో సంక్షే మ పథకాలు నియోజక వర్గం లో ప్రతి గడపకు చేరాయని కావునా ఓట్లు అడిగే పూర్తి హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రం ఉందని తనను రాను న్న ఎన్నికల్లో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తనను తమ ఇంటి ఆడబిడ్డగా అంద రు ఆదరించాలని ఆమె కార్య కర్తలను కోరారు.ఈ కార్యక్ర మంలో ములుగు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్,సుధీర్,సీనియర్ నాయకులు మల్క రమేష్, వినయ్ కుమార్,పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, ముడుతనపల్లి మోహన్,గొర్రె సమ్మయ్య,సర్పంచ్ పవన్ కుమార్,రూప్ సింగ్,రామన్, మహేష్,మధు,ఆత్మ చైర్మన్ చందా చక్రపాణి,ములుగు మండలంలోని గ్రామ శాఖ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.