కులవృత్తులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కులాలకు ఆర్థికఅండ
-ఎమ్మెల్యే
రసమయి బాలకిషన్
బీసీల అభివృద్దే బీ.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలోని కేఎస్ఆర్ గార్డెన్లో ఆదివారం మానకొండూర్ నియోజకవర్గ స్థాయిలో బీ.సీ. కుల వృత్తులకు మంజూరైన లక్ష రూపాయల చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ మాట్లాడుతూ…
పల్లెల్లు ప్రగతికి పట్టుకొమ్మలని, బీసి కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందించాలనే సంకల్పంతో ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే రసమయి వివరించారు..మానకొండూరు నియోజకవర్గం..
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నిరాదరణకు గురైన కులాలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
మానకొండూరు నియోజకవర్గం లో మొదటి విడతగా 192 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజక, కుమ్మరి, కమ్మరి, కంసాలి, మేదరి వంటి వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరాలని ప్రతి లబ్ధిదారునికి సహాయం అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల జడ్పిటిసిలు, ఎంపీపీలు,మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.