మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల అభివృద్ధి చేయడమే ప్రేమ సాగర రావు లక్ష్యం.
చేపట్టిన పనులు త్వరిత గతిన పూర్తి చేస్తాను.
మంచిర్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనుల నిర్మాణాలు సాధ్యమైనంతగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు పట్టణ ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ లను కూల్చివేసే కార్యక్రమాలను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం ప్రారంభించిన ఆలయ ప్రాంగణంలోని షాపింగ్ కాంప్లెక్స్ ను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని అంతేకాకుండా ఆలయాల అంతర్భాగంలో కూడా ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే పట్టణంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ఐటీ పార్కు నిర్మాణ పనులను లక్ష్మీ టాకీస్ నుండి రంగపేట వరకు వెళ్లే ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణాలు పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి పనులు ఇదివరకే చేపట్టడం జరిగిందని వచ్చే ఐదు ఆరు నెలల్లో ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





