(తిమ్మాపూర్ సెప్టెంబర్ 25)
రాష్ట్ర సాంసృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఆధ్వర్యంలో 150 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఎమ్మెల్యే రసమయి మానకొండూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై గులాబీ గూటికీ చేరడం జరిగిందన్నారు.వచ్చే ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి అయిన రసమయి గెలుపులో భాగస్వాములమై, మరింత అభివృద్ధికి బాటలు వేస్తామని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు ఇనుకొండ జితేందర్ రెడ్డి, రేణిగుంట బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎలుక ఆంజనేయులు, ఉప సర్పంచ్ కుంభం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బొంగని రమేష్, ల్యాగల వెంకట్ రెడ్డి బుర్ర అంజయ్య తమ్మనవేని శ్రీనివాస్ గొల్లపెల్లి మల్లేశం బోయిని తిరుపతి, కనపర్తి చంద్రశేఖర్, పోతుగంటి రమేష్ జెల్లా సాయికృష్ణ తమ్మనవేని శ్రీనివాస్ జక్కి అనిల్ బోయిని సతీష్ గ్రామ యువకులు పాల్గొన్నారు.