రాజకీయం

ఖాళీ అవుతున్న కాంగ్రెస్…

229 Views

మంథని నవంబర్ 5:బీఆర్‌ఎస్‌ పార్టీలో బారీ చేరికలు.
మంథని ఖాళీ అవుతున్న కాంగ్రెస్.
రత్నపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం జరిగింది.

బీఆర్‌ఎస్‌ పార్టీలో రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌ బీజేపీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు స్వచ్చందంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. మంథని నియోజకవర్గంలోని తూర్పు మండలాలతో పాటు రామగిరి,కమాన్‌పూర్‌, మహాదేవపూర్, కాటారం,ముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ గూటికి చేరుతున్నారు. రామగిరి మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధ్దిని చూసి బీఆర్‌ఎస్‌లోకి రావడం జరిగిందని, అభివృధ్ది, సేవ చేసే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపు కోసం పనిచేస్తామని వారు ఈ సందర్బంగా తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *