ములుగు జిల్లా,సెప్టెంబర్ 25
మంగపేట మండలం మల్లూరు గ్రామంలో బీజేపీ మండల నాయకులు ఎర్రం గారి విరన్ కుమార్ ఆధ్వర్యంలో భారతీ య జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీనదయాళ్ ఉపా ధ్యాయ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1937 ఆర్ఎస్ఎస్ లో చేరి ప్రాదేశిక ప్రచారక్ స్థాయిలో ఎదిగారని 1952 భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు గా పని చేశారని ఏకాత్మ మాన వత వాదాన్ని పార్టీ సిద్ధాంతంగా మార్చిన గొప్ప నాయకుడు దీనదయాళ్ ఉపాధ్యాయులని విరన్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిర్ర యాక య్య,బింగి రుక్కయ్య,గండి వినయ్ కుమార్,బైరిశెట్టి రాజ వర్థన్,యర్రంగారి సందీప్,గడ్డం జస్వంత్,శ్రీ రామ్,చేతన్,గుండె బోయిన బాలు,తదిత రులు పాల్గొన్నారు.