ప్రాంతీయం

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ 2 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత 

221 Views

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ 2 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈరోజు మర్కూక్ మండలంలోని గణేష్ పల్లి గ్రామానికి చెందిన గడియారం పద్మ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది,మృతురాలు గడియారం పద్మకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నుండి 2 లక్షల లక్షల ప్రమాద బీమా చెక్కును గడియారం పద్మ వంశీకృష్ణ కు ప్రమాద బీమా చెక్కును అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బాధితుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు, ప్రభుత్వం ఎప్పుడు ప్రజా క్షేమం గా పనిచేస్తుందని చెప్పారు, బిఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కు కుటుంబానికి పార్టీ ముఖ్యమంత్రి కేసీఅర్ అండగా ఉంటరని చెప్పారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల మాదిరిగానే దేశానికి దిక్సూచి మారిందన్నారు, ముఖ్యమంత్రి కేసీఅర్ గారు బారాస కార్యకర్తల శ్రేయస్సు కోసం 2లక్షల ప్రమాద భీమ లాంటి సౌకార్యాన్ని కల్పించారన్నారు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జీవించేందుకు అనేక పథకాలను పార్టీ అమలు చేస్తుందని చెప్పారు , కార్యకర్తలను కాపాడుకునేది ఒక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు, వేరే ఇతర పార్టీలు ఇట్లాంటి ప్రమాద బీమా కానీ కార్యకర్తల గురించి ఎలాంటి వాటిని ఇవ్వలే ఇవ్వడం లేదన్నారు, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలన్న మేరకే ఈరోజు మృతుని కుటుంబానీ 2లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు, , కార్యకర్తలకు అండగా బారాస పార్టీ ఉంటుందనన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని హంగులతో అభివృద్ధి సంక్షేమం లో పరుగులు పెట్టిస్తున్నారు అన్నారు, బంగారు తెలంగాణగా దిశగా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు నీళ్ళు నిధులు నియామకాల తో మొదలైన ఉద్యమం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధికారత మరియు ఇప్పుడు కాలేశ్వరం జలాలతో బీడుబడిన తెలంగాణ లలను పంట పంట గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధి రేటు లో భారతదేశంలో ముందువరుసలో ఉందన్నారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారిందన్నారు చదువుకున్న నిరుద్యగ యువతీ యువకులు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు నీళ్లు నిధులు నియామకాల తో తెలంగాణ కల సాకారం అయిందన్నారు.కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారింది అన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని ప్రగల్బాలు పలికిన నరేంద్ర మోడీ పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేసి రైతు నోట్లో మన్ను కొడుతున్నారని విమర్శించారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎరువుల ధరలను పెంచి రైతులను విడిచారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను చేపడుతుందన్నారు  రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగడుగునా అడ్డుకుంటుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండు గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,సర్పంచ్ మంజుల శ్రీరాములు,ఎంపిటిసి గోలి నరేందర్ నాయకులు రామరాజు,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *