దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న మహంకాళి అమ్మవారి దేవాలయానికి తన వంతు సహకారం అందించాల్సిందిగా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావును రెడ్డి సంఘం సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా రెడ్డి సంఘం సభ్యులను ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు.
