ప్రాంతీయం

దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్

125 Views

ప్రజావాణి లో శాఖల వారిగా వచ్చిన దరఖాస్తులు 40

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వచ్చిన 40 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజే యాలన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *