సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సోప్పరి నర్సమ్మ వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అంతాయ గూడెం సర్పంచ్ సిద్ధిపేట జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ విభాగం అధ్యక్షులు తిగుళ్ళ సత్యం సహకారం తో
బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి ₹ 3000/- రూపాయలు అర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రిపోర్టర్ రామచంద్రం,గ్రామ బి అర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాము, లక్ష్మణ్, కృష్ణ,తనిష్ తదితులున్నారు.
