ప్రాంతీయం

ముస్తాబాద్ మండలం తెరుమద్ది గ్రామశివార్ లో చిరుత కలకలం…

149 Views

ముస్తాబాద్ అక్టోబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గ్రామ శివారులో చిరుత సంచారం… సిరిసిల్ల జిల్లా మండలాలకు సంబంధించిన గత కొన్ని నెలలుగా పాడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామం పెద్దమ్మ గుడి సమీపంలో ఒకదూడ  గోపాల్ పల్లి తండాలో మరోదూడ ఇలా రెండు దూడలు గంభీరావుపేట్ మండలం ముచ్చర్ల శివారులో ఒక దూడ దాడిచేసి చంపేయగా ముస్తాబాద్ మండలానికి ఆనుకొని దుబ్బాక మండలం చల్లాపూర్ పరశురాంనగర్ అచ్చమాయపల్లి చివర్లలో ఊరుకొక దూడపై దాడి చేయగా రైతులు అయోమయంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు సంబంధిత తమ వ్యవసాయ భూముల వద్ద పాడీగేదెలను ఎవరికి అనుకూలమైన వారి భూములలో వాళ్లు పశువులను కట్టివేయగా వాటిమీద దాడి చేస్తున్నాయని రైతులు ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలమెల్లదీస్తున్నామని రైతులు తెలిపారు. ఇటీవల తెర్లుమద్ది సేవలాల్ తండా గన్నవారిపల్లె నక్కవాగు ప్రాంతాలలో చిరుత కదలికలు ఉన్నాయని రైతులు సంబంధిత అధికారులకు సమాచారం అందించగా అధికారులు స్పందించి నమూనాలు ముద్రలు కొలతలు సేకరించారు. అనంతరం అధికారులు ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువులను ఇంటిదగ్గరకు మార్చుకోవాలని పలు సూచనలు ఇచ్చారని రైతులు తెలిపారు.


IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7