ప్రాంతీయం

దుర్గమ్మ దేవాలయంకు 2,00,000 లక్షల రూపాయలు విరాళం అందజేసిన గౌడ సంఘం

158 Views

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దుర్గామాత ఆలయానికి మునిగడప గౌడ సంఘం తరుపున ₹ 2,00,000 లక్షల రూపాయలను మునిగడప గ్రామ ముదిరాజ్ సంఘం కు విరాళం గా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ముదిరాజ్ ల కోరిక మేరకు అడిగిన వెంటనే గుడి నిర్మాణం కు ₹ 2,00,000 లక్షల రూపాయలు అందించడం జరిగిందని వారు వివరించారు. గుడి నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలను అందించాలని కోరారు, శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సీఎం కేసీఆర్ దేవాలయాలకు పునరినిర్మాణం వచ్చిందన్నారు,
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ ,సర్పంచ్ బాలక్ష్మీ ఐలయ్య, గౌడ సంఘం నాయకులు ముదిరాజ్ పెద్దలు స్వామి, బిక్షపతి,గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *