ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ మృతులకు నివాళులు

69 Views

భావి మార్గదర్శకుల మృతి బాధాకరం
ఢిల్లీ ఘటనపై డీసీసీ అధ్యక్షరాలు సురేఖ
మృతులకు నివాళులు

దేశ సేవలో భాగస్వాములు కావడానికి సివిల్స్ కు సిద్ధమవుతున్న ముగ్గురు వరదనీటిలో దుర్మరణం చెందడం విచారకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తాన్యా సోని, నవీన్, శ్రేయా యాదవ్ ల చిత్రపటాలకు సురేఖతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా సురేఖ మృతుల్లో శ్రీరాంపూర్ లో సింగరేణి అధికారి విజయ్ కుమార్ కూతురు సోని ఉండడం కలచివేసిందని అన్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ముగ్గురు మరణించడం దేశానికి వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చిందని తెలిపారు. సెల్లార్ లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరద పోటుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు

ఢిల్లీలోని Rau’s సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న తాన్య సోని , శ్రేయా యాదవ్, నవీన్ దల్విన్ ముగ్గురు వరదల్లో ప్రమాదవశాత్తు మరణించగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు..

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్