
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల పరిధిలోని అంతయ గూడెం గ్రామానికి చెందిన పిట్టల ఎల్లయ్య శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు, విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, స్థానిక సర్పంచ్ తిగుల్ల సత్యం, మండల ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షులు సురేష్,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




