ముస్తాబాద్, సెప్టెంబర్24, మండలంలోని గూడూరు, మొఱ్ఱాయిపల్లి, మద్దికుంట గ్రామాలలో పలువురు నాయకులు ,మహిళలు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో తదితర గ్రామాలలో బారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కాగా నేడు కూడా చేరికలు జరిగాయి ఈమూడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజీవ్ పథకాల స్థానంలో కెసిఆర్ పథకాలొచ్చాయి ఏఒక్క పథకం తీర్చిన దాఖలాలులేవు బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో పేదలకు ఇళ్ళస్థలం, పక్కాఇల్లు, ఇళ్ల స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇవన్నీ విస్మరించారు. మధ్యతరగతి వారికి ప్రత్యేక గృహపథకం పేరుతో నోటికొచ్చిన వాగ్దానాల వర్షం కురిపించింది. ఇంటికో ఉద్యోగంలేదు, దళితుడికి మూడెకరాల భూమిలేదు గాలిమేడలే తప్ప ఇళ్ళనిర్మాణం సాగలేదు. తెలంగాణ పోరాటంలో పన్నెండు వందలకు పైచిలుకు విద్యార్థులతో పాటు ఎందరో ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడితే చనిపోయిన కుటుంబాలను పరామర్శించకపోవడమే కాకుండా ఇంటికో ఉద్యోగంమని చెప్పి కనీసం చనిపోయిన కుటుంబాలను అక్కున చేర్చుకొని భరోసానిచ్చిన దాఖలాలేవన్నారు. నీవు ఇచ్చిన వాగ్దానం ఇంటికి ఉద్యోగం అన్నావు పెరిగిన ఇళ్ళ అద్దెలతో పేదలే కాదు మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తుతున్నాయి. సొంత ఇల్లు కలగానే మిగిలిపోయింది. కుటుంబ ఆదాయంలో ఎక్కువభాగం అద్దెలకే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా జిల్లా గడ్డమీద పుట్టి మాట్లాడుతున్నారంటే మాట తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చే ఆరు వాగ్దానాలు నెరవేర్చుకుంటూ మరెన్నో పథకాలు అమలు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో మండలంలోని వివిధ హోదాలుగల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
