Breaking News

కొత్త మండలంకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

223 Views

మండలం ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా అందజేయాలి

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు జిల్లా,సెప్టెంబర్ 24

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో కొత్త మండలం మల్లం పల్లి మండలం ఏర్పాటుపై గెజిట్ ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేడోక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో మల్లంపల్లి మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటి ఫికేషన్ నంబర్ 331/ 2023, తేది.23,09.2023 జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో విడుద ల చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ మండలం ఏర్పా టుపై ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నట్లయితే ఇంగ్లీషు లేదా తెలుగు భాషల్లో లిఖిత పూర్వకంగా 15 రోజు ల్లోగా నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించా లని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.ఈ గెజిట్ నోటిఫికేషన్ ను అన్ని జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రచురించాల్సిందిగా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *