Breaking News నేరాలు

గంజాయి కేసులో ముగ్గురు నిందుతుల అరెస్ట్.రిమాండ్ కి తరలింపు

98 Views

సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ కి చెందిన యువరాజ్ అనే వ్యక్తి నాందేడ్ నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి మరియు గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ కొనుక్కొని సిరికిల్ల కు తీసుకువచ్చి, తను తాగుతూ సిరిసిల్లలో గంజాయి తాగే వారికి గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ ని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూన్నాడు.

అదే క్రమంలో సిరిసిల్లలోని బతుకమ్మ తెప్ప వద్ద గల మడేలయ్య గుడి వద్దకు గంజాయి మరియు చాక్లెట్ లను తీసుకువచ్చి గుడి ముందర అమ్మడానికి సిద్దముగా ఉండగా అతడిని పట్టుకొని అతని వద్ద నుండి 250 గ్రాముల గంజాయి మరియు 29 గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది..

 

అదే విదముగా కొండ రంజిత్ కుమార్ అనే వ్యక్తి గంజాయి తాగుటకు అలవాటు పడి కరీంనగర్ లో గుర్తుతెలియని వ్యక్తి దగ్గర గంజాయి కొనుక్కొని వచ్చి రగుడు ఎల్లమ్మ గుడి సమీపంలోని చెట్ల పొదలలో దాచిపెట్టి గంజాయి తాగుతూ మరియు గంజాయి తాగే వారికి అమ్ముతూ అనుమానాస్పదముగా తిరుగుచుండగా అతడిని పట్టుకొని అతని వద్ద నుండి 120 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

 

సిరిసిల్ల పట్టణం బివై నగర్ కి చెందిన ఎండీ గౌస్ అనే వ్యక్తి గంజాయి తాగడానికి అలవాటు పడి గుర్తు తెలియని వ్యక్తులు వద్ద గంజాయిని హాఫ్డి లాక్స్ ద్విచక్ర వాహనంలో తీసుకువచ్చి రగుడు శివారు ప్రాంతాల్లో తను తగుతూ గంజాయి తాగే వారికి అమ్మడానికి చూస్తుండగా అట్టి వ్యక్తిని పట్టుకొని తనిఖీ చేయగా తన ద్విచక్ర వాహనంలో 180 గ్రాముల గంజాయి దొరకగా అట్టి గంజాయి ని స్వాధీనం చేసుకోని గౌస్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పై ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని సిఐ ఉపేందర్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *