జగదేవపూర్ మండల కేంద్రంలో గల మోడల్ పాఠశాలలో గల విద్యార్థులకు ముదిరాజ్ సంఘము మండల అధ్యక్షుడు రాగుల రాజు మరియు మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కర్ణాకర్ విద్యార్థులకు క్రీడాదుస్తులు అందించారు.ఈ సందర్భంగా రాగుల రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో మాత్రమే కాకుండా క్రీడాల్లో రాణించాలి అని అన్నారు. క్రిడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మా వంతు సహయాన్ని అందించడం జరుగుతుంది అని తెలిపారు.విద్యార్థులు శ్రద్ధతో చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్లివరాజు, ఉపాధ్యాయులు బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.