Breaking News

ఉర్దూ మీడియం పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలి

112 Views

*ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట వీవీలను తీసుకోవాలి*

*ఉర్దూ ట్రైన్డ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ షబ్బీర్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉర్దూ ట్రైన్డ్ టీచర్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు షైక్ షబ్బీర్ విలేకరుల సమావేశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం 2022-23 లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట నాణ్యతగల విద్యా అందియ్యలంటే మరియు ఏక ఉపాధ్యాయ పాఠశాలల్లో సెలబస్ పూర్తి కానీ యెడల విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయని.గత రెండు సంవత్సర నుంచి కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు సరిగ్గా నడవకపోవడంతో విద్యార్థులు చదువుల్లో వెనుకబడి పోయారని గత సంవత్సరంలో పాఠశాలలు పున ప్రారంభం ఐన కూడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు సరిగ్గా బోధన అందక వెనుకబడి పోయారని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బోధన అందియ్యలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంతో బడి బాట కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రైవేటు పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యారని గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తమ సేవలను అందిస్తున్న విద్యా వాలంటీర్లను ఈ విద్యా సంవత్సరం రెన్యూవల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత మైన విద్యా అందియ్యలని మరియు ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు 100% విజయవంతంగా విద్యా బోధనలో ముందుకు పోయేలా చరియలు తీసుకోవాలని ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యా శాఖా మంత్రి సబితాఇంద్ర రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గంభీరావుపేట మండల కేంద్రంలో నూతన హంగులతో నిర్మిస్తున్న కేజీ టు పీజీ విద్యా సంస్థలు మంత్రి కేటీఆర్ కృషి వల్లే అని మండల ప్రజలతో చుట్టుప్రక్కన మండలాల ప్రజల పిల్లలకు మంచి భవిష్యత్తు ఇక్కడ కేజీ టు పీజీ లో ఉంటదని సంతోష వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్రంలో టీ ఆర్ టీ కంటే ముందు మరో టెట్ నిర్వహించి న్యాయం చెయ్యాలని టెట్ క్వాలిఫై కానీ డీఎడ్ బీఎడ్ అభ్యర్థులు కోరుతున్నారని.నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
(ఎన్ సిటీఈ)రూల్స్ ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒక్క సారి నిర్వహించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2017 డీఎస్సి కంటే ముందు యాడాదికి ఒక్క సారి టీఎస్ టెట్ నిర్వహించి అప్పటి నుంచి ఇప్పటి వారికి ఐదు సంవత్సరాల తరువాత మల్లి టెట్ నిర్వహించడంతో చాలా మంది డీ ఎడ్, బి ఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్-1 మరియు పేపర్-2 రాసారు అందులో పేపర్ -2 కి 49.64% పాస్ అయ్యారు పేపర్-1 లో కేవలం 32% అభ్యర్థులు పాస్ కావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహిస్తే తమకు ఈ పరిస్థితి రాకపోయేది అని,రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యాడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలి అని చాలా మంది టెట్ లో ఫెయిల్ ఐన అభ్యర్థులు డీఎస్సి కంటే ముందు ఇంకో టెట్ మల్లి నిర్వహించాలని తమకు ఇంకో అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నారని స్థానిక మంత్రి కేటీఆర్ స్పందించి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చేవరకు విద్యా వాలంటీర్లను రెన్యూవల్ చేసి విధుల్లో తీసుకోవాలని గతంలో లాగానే టీ ఆర్ టీ కంటే ముందు మరో టెట్ నిర్వహించి అందరికి టీ ఆర్ టీ రాసె అవకాశం కల్పించాలని షేక్ షబ్బీర్ కోరారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna