రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది
– బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నాడని, ఉద్యమకారులు కేసీఆర్ మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ గ్రామంలో మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల జోగిరెడ్డితో పాటు పలువురు ఉద్యమకారులను కలవగా తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలని వారు ఆయనకు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ..
సీఎం తెలంగాణ ఉద్యమకారులను ఎన్నడో మర్చిపోయాడని, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్లంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులేనని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని ఆరోపించారు. మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బీజేపీ రాష్ట్ర అధిష్టానం అతి త్వరలోనే పార్టి ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి తో కలిసి తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ లో 9 లక్షల తో ఎంపీ లాడ్స్ నిదులతో ఏర్పాటుచేసిన హైమస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు.బీజేపీ సిద్ధాంతాలు, మోదీ విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చే వాళ్లను చేర్చుకుంటామని పేర్కొన్నారు. మానకొండూరు సహా తెలంగాణలో మోదీని బూతులు తిట్టినోళ్లను, బీజేపీని బద్నాం చేసినోళ్లను పార్టీలోకి రానివ్వబోమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, దరువు ఎల్లన్న, బొంతల కళ్యాణ్ చంద్ర, మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు, మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వర చారి, నాయకులు బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్, పబ్బ తిరుపతి,కిన్నెర అనిల్, తిరుపతి,గడ్డ అరుణ్, రాజు తదితరులు పాల్గొన్నారు..