(మానకొండూర్ నవంబర్ 06)
కోడెనాగు పాముతో సుమారు 40నిముషాలు పోరాడి పామును చంపేదాకా వదలని శునకాలు (లియో, నానీ,) ఈ సంఘటన మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామంలో చోటుచేసుకోంది.
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన దాసరి అంజయ్య జర్నలిస్ట్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలనుండి శునకాలను ఎంతో ఇష్టంతో ప్రేమగా సాదుకుంటున్నాడు.సాదుకుంటున్న శునకాలను లియో,నానీ అనే పేరుల తో పిలుచుకుట్టున్నాడు..
కుటుంబ యజమాని అంజయ్య మాట్లాడుతూ..
మూగజీవాలను పెంచుకోవడం నాకెంతో ఇష్టమని, ప్రాణాతి ప్రాణంగా నోరులేని మూగ జీవా లను పెంచు కోవడం చాల ఇష్టంమె కాకుండా ప్రాణం అని అన్నారు.
ఇటీవల కాలంలో ఉదయం పూట రోజులగా ఎవ్వరిపనుల్లో వారు నిమగ్నం ఉండగా ఇంట్లోకి కోడె నాగుపాము బుసలు కొట్టుతు ఇంట్లోకి చోరబడింది.పసిగట్టిన మా శునకాలు ప్రాణాలకు తెగించి వాటిని వెంబడించి నోటా కరుచుకొని సుమారు 40నిముషాలు పాముతో పోరాటం చేసి పామును చంపేసింది.
అనంతరం శునకం అపస్మారక స్థితిలో వెళ్లడం తో వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ పశువుల అస్పత్రికి తరలించడంతో వైద్యులు వెంటనే చికిత్స అందించి శునకం ప్రాణాలు కాపాడారు.శునకం ప్రాణాలు కాపాడిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన కుటుంబ యజమాని అంజయ్య.