భరత్ నగర్ వినాయక మండపం వద్ద అన్నదానం
గజ్వేల్ 22 సెప్టెంబర్ గజ్వేల్ భరత్ నగర్ లో సిరి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ భరత్ నగర్ లో కౌన్సిలర్ శిరీష రాజు మరియు సిరి యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటున్న కాలనీవాసులు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఈ డీ, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సంపత్, లయన్ నాగేందర్, ఆర్యవైశ్య నాయకులు బిఆర్ఎస్ నాయకులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు
