(మానకొండూర్ సెప్టెంబర్ 24)
తెలంగాణ వీర వనిత, వీరనారి చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకల ఆహ్వాన కమిటీ కో కన్వీనర్ గా మానకొండూరు మండలం కొండపలకల గ్రామానికి చెందిన శాతరాజు యాదగిరి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ..
చిట్యాల ఐలమ్మ దొరల ఘడీల పాలనకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత అని ఆమె సేవలను కొనియాడారు. భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఐలమ్మ ధైర్యం, తెగువ, ఆనాటి రజాకార్ల గుండెల్లో దడ పుట్టించాయని అన్నారు ఒకవైపు ఉద్యమం చేస్తూనే ఉద్యమకారులకు అన్నం పెట్టిన మహానీయురాలు ఐలమ్మ అని ఆమె చేసిన సేవలను కొనియాడారు.ఐలమ్మ ను తెలంగాణ తల్లిగా గుర్తించి సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను రాష్ట్రస్థాయిలో నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రకమని అన్నారు.
తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ,రజక సంఘం నాయకులు అక్కరాజు శ్రీనివాసు, దుబ్బాక రమేష్ ,పెద్దాపురం కుమారస్వామి తదితరులకు శాతరాజు యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు.




