ముస్తాబాద్, సెప్టెంబర్ 22,
గూడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగమణి అనునామెను తన భర్త ఆంజనేయులు మద్యానికి బానిసై గత కొంతకాలం నుండి వేధిస్తున్నాడని ,అయితే నిన్నటి రోజు 21.09.2023 రాత్రి 10 :30 గంటలకు ఇంట్లో కొత్తపల్లి నాగమణి చనిపోయిందని సమాచారం రాగా తన బంధువులు వచ్చి గమనించగా మెడపై గాయాలు గుర్తించి, నాగమణి మరణంపై అనుమానం ఉన్నదని మృతురాలి అన్న చేపూరి సత్తయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు అయిందని ఎస్ఐ తెలిపారు.




