(తిమ్మాపూర్ డిసెంబర్ 30)
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తిమ్మాపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్బర్ అన్నారు..
శనివారం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో సర్పంచ్ బొజ్జ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవానికి హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి సభకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఉంటు రాజ్యాంగం ద్వారా సక్రమించిన హక్కులను ప్రతి ఒక్కరూ పొందాలని సూచించారు.ఏదైనా సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
అనంతరం సర్పంచ్ బొజ్జ తిరుపతి మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారని ఇదేవిధంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు.
అనంతరం అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి మాట్లాడుతూ
సమాజంలో కులాల పట్ల,వ్యక్తుల పట్ల ఆర్థిక అసమానతలు తొలగించడానికి,సమాజంలో అంటరానితనం అనేది లేకుండా నిర్మూలించడమే పౌర హక్కుల దినోత్సవ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.ఈ చట్టాల పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండలని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు అంబేద్కర్ సంఘ నాయకులు ముకుమ్మడిగా గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి సర్పంచుకు ఎస్సీ రిజర్వేషన్ అనేదే లేదని సభ దృష్టికి తీసుకువస్తూ,గ్రామంలో అధికంగా ఎస్సీ జనాభా ఉన్న కూడా రిజర్వేషన్ రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది,దీంతోపాటు దళితులకు ఇదివరకు ఉన్న భూములకు పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేసి పాస్ బుక్ ఇవ్వాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బండారి రమేష్,పలు శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శి ,అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు దొబ్బల రాజవీరు,ఉపాధ్యక్షులు కనకం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఖమ్మం కుమారస్వామి,గౌరవ అధక్షులు ఖమ్మం కృష్ణ మరియు సభ్యులు పౌల్, తిరుపతి,దుర్గాప్రసాద్, మొగిలి,రాజయ్య, శివ, భూమయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు…