రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నకిలీ ప్లానర్ ను అని బెదిరించి డబ్బులు వసూలుకు ప్రయత్నించిన వ్యక్తిపై పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
కావేటి ప్రవీణ్ అను వ్యక్తి వెములవాడ పట్టణం లోని తాజ్ రెస్టారెంట్ లో కి వెళ్లి, నేను టౌన్ ప్లానర్ ను అని, తనకు రూ.5000/- మరియు బిర్యానీ ఇవ్వాలి అని లేకుంటే హోటల్ ఫై రైడ్ చేస్తాను అని బెదిరించగా, భాదితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా నిందుతుని ఫై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
