రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా మంగళవారం రోజు మృతి చెందడానికి కుటుంబ సభ్యులు తెలిపారు.గూడెం గ్రామానికి చెందిన ఇడుగురాళ్ల చందు (36) అనే వ్యక్తి గౌడ కులవృత్తి నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇటీవల చెల్లెళ్లకు పెళ్లిళ్లతో సహా నూతిని పెళ్లికి కొంత అప్పుచేసి చేసిన అప్పును ఎలా తీర్చాలో బెంగతో గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుందామని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.
