రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్స్టేషన్లో నేడు మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు ఠాణా దివాస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించబడునని ఎస్సై మహేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలోమాట్లాడుతూ..శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, ప్రజల నుండి స్వయంగా విన్నపాలు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం చేపట్టిన “ఠాణా దివస్” కార్యక్రమంలో భాగంగా తేదీ 12-09-2023 మంగళవారం రోజున గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉండి మండల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి,దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.