రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని డి.ఎస్.పి కత్తు రోజు నాగేంద్ర చారి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వేములవాడ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన పల్లెపు రాజు,పరిసరాములు అనే ఇద్దరు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను ఎంచుకొని గత నెల 25వ తారీఖున కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామ శివారులో రాముని గుట్ట వద్ద ఓ ముసలావిడ పొలం పని చేస్తుండగా ఆమె మెడలోంచి పరశురాములు పుస్తెలతాడు తెంపుకొని కొద్ది చక్ర వాహనంపై పడరయ్యారని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా చందుర్తి సీఐ అచ్చ కిరణ్, కొనరావుపేట ఎస్సై ఆంజనేయులు, కానిస్టేబుల్ సతీష్, నరేష్, రవి,విశాల్,గణేష్ లు మూడు బృందాలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు వారిని ఫోటోలను విడుదల చేస్తూ చాలా చాకలిచక్కంగా పట్టుకొని వారి వద్ద ఒక బంగారు గొలుసు,రెండు సెల్ ఫోన్లు,ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని అన్నారు.
15 రోజుల్లో నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్నందుకు డిఎస్పి కత్రోజు నాగేంద్ర చారి పోలీస్ సిబ్బందిని అభినందించారు.
