*ఎస్టి గురుకుల ప్రిన్సిపాల్, వార్డెన్ ను సస్పెండ్ చేయాలి*
పిల్లల చేత వంట చేయించడ మేOటి
ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు
విద్యార్థుల చేత వంట చేయిస్తున్న ఎస్టీ గురుకుల ప్రిన్సిపాల్,హాస్టల్ వార్డెన్ లను సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు
సెప్టెంబర్ 19
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఏఐఎస్బి జిల్లా నాయకులు గడిపే సుజిత్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన హుస్నాబాద్ ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు మాట్లాడుతూ…. పిల్లల చేత చపాతీలు చేయిస్తున్న ప్రిన్సిపాల్ విజయసాయిరెడ్డి, హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చేత రొట్టెలు, చపాతీలు చేయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా ఉదయం 11 గంటలకు ఆలస్యంగా పిల్లలకు టిఫిన్ పెట్టడాన్ని తప్పుపట్టారు. సమయానికి అటెండర్, వాచ్మెన్ మరియు టీచర్లు ఎవ్వరు లేరని, పిల్లలకు సరైన సమయంలో భోజనం అందడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని, ప్రతిరోజు పప్పు పెడుతూ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. అరటి పండ్లు, గుడ్లు ఏవి ఇవ్వడం లేదని నీళ్ల చారు పురుగులు అన్నం పెడుతున్నారని పిల్లలు వాపోయారు. మారుమూల ప్రాంతాల నుండి పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకోవడానికి అని గురుకులానికి వస్తే వారి చేత పనులు చేయించడం హేయమైన చర్య అని అన్నారు. పిల్లలు ఎవరు కూడా పనులు చేయవద్దని, చక్కగా చదువుకోవాలని ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వెంటనే ఎస్టీ గురుకులం ప్రిన్సిపాల్, వార్డెన్ లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రియాంక, రాజేష్, హరీష్, ఫణిందర్, మహేష్, మమత తదితరులు పాల్గొన్నారు.
