చెక్కులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు
సెప్టెంబర్ 19
కామారెడ్డి జిల్లా పెద్ద ఆక్టివిటీ పెద్ద కొడప్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్వల్పకాలిక రుణాలు మాఫీ అయిన సభ్యులకు, నూతనంగా రుణాలు మంజూరు అయిన సభ్యులకు ప్రజా ప్రతినిధులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ స్వల్పకాలిక రుణాలు మాఫీ అయిన 36 మంది సభ్యులకు 27,55,000 రూపాయలు, నూతన 60 మంది సభ్యులకు 30,72,500 రూపాయలు స్వల్పకాలిక రుణాలు మంజూరు అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరక్టర్ సాయగౌడ్, దస్తారెడ్డి, సర్పంచ్ తిరుమల రెడ్డి, భుషప్ప, ఏఎంసి వైస్ చైర్మన్ ఖండెరావు పటేల్, సెక్రటరీ సందీప్ కుమార్ పాల్గొన్నారు.





