Breaking News

ఆశవర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

121 Views

ఆశ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని కమిషనరేట్ ముట్టడికి వెళుతున్న తరుణంలో మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నా ఎల్ఎండి పోలీసులు….

జగిత్యాల జిల్లా వెల్గటూర్, సారంగాపూర్, గంగాధర్, న్యూ అంబర్పేట్, మండలల నుంచి సుమారు 50 మంది ఆశావర్కర్లు హైదరాబాద్ లోని కమిషన్ రేట్ ముట్టడికి వెళుతున్న తరుణంలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకొని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అనంతరం ఆశ వర్కర్లు వారు మాట్లాడుతూ..

18 సంవత్సరాల నుంచి వెట్టిచాకిరి చేసామని, కరోనా టైంలో ఎంతో కష్టంగా ఉన్నా మా విధులను సక్రమంగా నిర్వహించామని, ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచడం లేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు.

పర్మిషన్ తీసుకొని మేము హైదరాబాద్ కి వెళ్తున్నామని, అయినా మమ్మల్ని దారి మధ్యలో అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *