మిత్రుడి కూతురుని అభినందించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట. న్యూస్
తన డిగ్రీ క్లాస్ మెట్ ఎల్లారెడ్దిపేట కు చెందిన మాజీ ఎంపీటీసీ దంపతుల కుమార్తె ఒగ్గు బాలరాజ్ యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట లోని ఒగ్గు బాలరాజు యాదవ్ ఇంటికి వచ్చి ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బైపిసి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతూ రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంక్ సాధించగా ఆమెను మేడిపల్లి సత్యం , ప్లవర్ బొకేను ఇచ్చి శాలువా తో సన్మానించారు. ఈ సందర్బంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తన క్లాస్ మెట్ కూతురు శ్రీనిధి యాదవ్ నాలుగో స్టేట్ ర్యాంక్ సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు.శ్రీనిధి యాదవ్ ను స్ఫూర్తిగా తీసుకుని మంచిగా చదవాలని శ్రీనిధి యాదవ్ భవిష్యత్ లో డాక్టర్ సీటు సాధించాలని ఆయన ఆశీర్వదించారు. కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శ్రీనిధి యాదవ్ తో చరవాణి లో మాట్లాడుతూ ఎక్కడ చదువుతున్నావు.ఎంత ర్యాంక్ వచ్చింది. నీకు బైజ్యుస్ లో కానీ ఏదైనా మంచి కాలేజీలో నీట్ కోచింగ్ ఇప్పిస్తానని జిల్లా కలెక్టర్ ఆమెకు హామీ ఇచ్చారు.శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మా రెడ్ది, బొప్ప పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడీ రాం రెడ్ది,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ రెడ్ది మెండే శ్రీనివాస్ యాదవ్, సుడిది రాజేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గౌస్ బాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్ది, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్ని బాబు మాజీ వార్డు సభ్యులు ఒగ్గు లక్ష్మి యాదవ్, బండారి బాల్ రెడ్ది,పందిర్ల శ్రీనివాస్ గౌడ్,ద్యాగం లక్ష్మి నారాయణ, బుచ్చిలింగు సంతోష్ గౌడ్,శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్,ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ బింగి మల్లేశం అంతేరుపుల గోపాల్, గుర్రపు రాములు,పందిర్ల లింగ గౌడ్, స్నేహితులు సురభి కాంతారావు తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
