Breaking News

అధ్యక్షులు గా నియామకం

83 Views

జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి

*నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ చైర్మన్  మహమ్మద్ యాసీన్*

 

సెప్టెంబర్ 19

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ జాతీయ చైర్మన్ . మహమ్మద్ యాసీన్ నియామక పత్రాన్ని అందజేశారు. నేటి నుండి సంస్థ యొక్క రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూ నేషనల్ కమిటీ తీర్మానం చేయగా రాష్ట్ర అధ్యక్షులు గా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి  నియామకం అయ్యారు.

అనంతరం అయన మాట్లాడుతూ ఈ సంస్థ లొ అతి తక్కువ సమయం లొ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం అదృష్టం గా భావిస్తున్నాను అని, సంస్థ నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించడం, సంతోషకరం అని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిటీ సంస్థ ఏ పార్టీలకు, సంఘాలకు అనుబంధం కాదని నీతి అయోగ్ ద్వారా ఆమోదం పొందిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని స్పష్టం చేశారు. మానవ సేవే మాధవ సేవ గా భావిస్తానని, అతి తొందరలో రాష్ట్ర పలు దిక్కుల్లో ప్రజల సమస్యలపై పోరాడానికి సిద్ధం చేస్తానని, పేద ప్రజలకు అండగా ఉంటూ మానవ హక్కులకు, మరియు చట్టపరమైన నియమ నిబంధనకు లోబడి ఉంటూ, ప్రజలకు ప్రభుత్వనికి మధ్య వారధిగా ఉంటూ సంస్థ యొక్క పేరును నిలబెట్టే దిశగా కృషి చేస్తానని, దీనికి అందరూ సహకరించాలని, మరియు జిల్లా, మండల కమిటీల తో త్వరలోనే రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలొ నేషనల్ చైర్మన్ డా. మహమ్మద్ యాసీన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చారగొండ రమేష్ రెడ్డి, మరియు ప్రచార కార్యదర్శులు ఎలకంటి రాజు, యాసారపు కర్ణాకర్ లు, ములుగు జిల్లా అధ్యక్షుడు పాలతీయ రాజ్ శేఖర్ నాయక్, బచ్చనపేట మండల అధ్యక్షులు ఇజ్జగిరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *