మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందిప్రముఖ హుస్నాబాద్ నియోజకవర్గ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి
*భీమదేవరపల్లి
మహనీయుల విగ్రహాల ఏర్పాటులో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి గారు అన్నారు. శుక్రవారం నాడు భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న
ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించి తనవంతుగా 20,000/-వేల రూపాయలు సంఘం సభ్యులకు విరాళాన్ని అందించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయుల చరిత్ర, వారు అనుసరించిన విధానాలు, వారు చూపెట్టిన మార్గదర్శకత్వం, నేటి యువతరానికి ఎంతైనా అవసరం ఉన్నదని కాబట్టి ఈ విగ్రహాల ద్వారా కొంత నైనా సజీవంగా వారి చరిత్రను ముందు తరాలకు అందించిన వాళ్ళమవుతామని ఆ బాధ్యతను తీసుకున్న అంబేద్కర్ సంఘ నాయకులను అభినందించారు..ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమురయ్య, నాయకులు నాగరాజు, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, మంజులక్క యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు
