Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం

47 Views

 

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం

 

ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024
బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి చకిలం మధు, నూతనంగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని అలాగే గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేటి సాయిలు తదితరుల ను ఫౌండేషన్ అధ్యక్షులు శనిగరపు బాలరాజు ఆధ్వర్యంలో బాల్యమిత్రులు శాలువాలతో సత్కరించి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీలకతీతంగా బాల్యమిత్రులు పదవులు పొందడం హర్షించదగ్గ విషయమని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సన్మాన గ్రహితులు మాట్లాడుతూ బాల్య మిత్రుల ఆధ్వర్యం లో సన్మానం జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాల్యమిత్రులు పందిర్ల పరశురాములు గౌడ్, ఎలగందుల నరసింహులు, నూకల శ్రీనివాస్ యాదవ్, కొర్రి రమేష్, చింతకింది శ్రీనివాస్, బుస్సా రాజేశ్వర్, అయిత దేవరాజు, పాలోజి శ్రీనివాస్, గోరిటం శ్రీనివాస్, అవధూత మారుతి, వీరమ్మ గారి రాజు తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్