– మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
– బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
దౌల్తాబాద్; ప్రకృతి తో మానవ సమాజానికి విడదీయరాని అనుబంధం ఉందని, ప్రకృతి ని రక్షించుకుంటూ..దైవారాధన చేసుకుంటూ ముందుకు సాగుదామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పిలుపునిచ్చారు..మండలంలోని వెంకట్రావుపేట లో వినాయక చవితి ని పురస్కరించుకుని మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలంలో సైతం ప్రకృతిని దేవతారాధనగా ఆరాధించే వారన్నారు. ప్లాస్టరాఫ్ ప్యారీస్ తో చేసే వినాయక విగ్రహాలతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. విగ్రహాల సైజ్, రంగులతో సంబంధం లేకుండా మన భక్తి, శ్రద్ధలు ముఖ్యమన్నారు..కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కంకణాల నర్సింలు, రైతుబంధు అధ్యక్షుడు బండారు స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈదుగాళ్ల పర్శరాములు, నాయకులు పిట్ల వెంకటయ్య, కాళిదాసు శ్రీనివాస్, కత్తుల రమేష్, ఎంగలి రాములు, పాత్కుల స్వామి, అజాం, సుతారి రాంబాబు, కల్లెపు నరేష్ కుమార్, పులిగారి గణేష్, మిద్దె సురేశ్, బొగ్గుల నర్సింలు, రేపాక అభి యాదవ్, స్వామి, తుప్పతి రమేష్, బెజ్జనమైన గణేష్ తదితరులు పాల్గొన్నారు..